—బతుకమ్మ వేడుకలలో అన్ని శాఖల మహిళా అధికారులు మరియు టీజీవో మహిళా విభాగం*
—తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటి చెప్పిన బతుకమ్మ సంబరాలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు.
రంగారెడ్డి: అక్షర కలం
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO Association) మహిళా విభాగం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం చైర్మన్ రేవతి, శ్రీమతి శాంతి శ్రీ, శ్రీమతి సైదమ్మ, శ్రీమతి అనిత గార్లు పాల్గొని వైభవంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు, మహిళల సందడి, సమష్టి భాగస్వామ్యంతో టీజీవో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను కొలుస్తూ, పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శ్రీమతి కిరణ్మయి, IAS ఇంచార్జి కలెక్టర్, రంగారెడ్డి జిల్లా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటూ, రంగారెడ్డి జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటంలో అందరూ భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపుతుందన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల జీవన సంస్కృతిలో విడదీయలేని భాగంగా కొనసాగుతోందని, మహిళలు ఐక్యంగా పాల్గొని సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీమతి పావని, శ్రీమతి జ్యోత్స్నా, శ్రీమతి వినీత , శ్రీమతి కవిత, శ్రీమతి శాంతిరేఖ, శ్రీమతి రోజా, శ్రీమతి హేప్సిబా, శ్రీమతి ఉదయ , శ్రీమతి స్వాతి, శ్రీమతి శైలజ, శ్రీమతి స్రవంతి, శ్రీమతి అనిత, శ్రీమతి విజయ శ్రీ, పాల్గొన్నారు