AKSHARA KALAM
Date of Publish : 16 October 2026, 7:55 pm Posted by : AKSHARA KALAM

గాంధీ భవన్‌లో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

–పాల్గొన్న నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

గాంధీ భవన్‌లో శుక్రవారం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్ఎస్ ఏ ఇంచార్జీ గంప వేణు గోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ ) అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొని, పార్టీ నిర్వహణ, సంస్థాగత బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన చర్చల్లో భాగస్వాములయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు.