గద్వాల లో వాసవి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
గద్వాల్ టౌన్ అక్షరకలం:
గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం వాసవి మాత ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆలూరు బిలకంటి రాములు ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.6.11 కోట్ల నగదుతో అలంకరించారు. ప్రతి ఏడాది నవరాత్రుల్లో శుక్రవారం అమ్మవారిని నగదుతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలూరు బిలకంటి రాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాలలో ప్రతి ఏటా కోట్లాది రూపాయలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల్ యాదవ్, త్యాగరాజు, సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్, యువజన సంఘం అధ్యక్షుడు బాదం జగదీష్, కార్యదర్శి వెలగంటి వినోద్, కోశాధికారి కొండా రాఘవేంద్ర, వజ్రాల రాజేష్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ నరహరి హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.