*రూ.6.11 కోట్లతో ధనలక్ష్మిగా వాసవి మాత దర్శనం*
గద్వాల లో వాసవి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గద్వాల్ టౌన్ అక్షరకలం: గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం వాసవి మాత ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆలూరు బిలకంటి రాములు ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.6.11 కోట్ల నగదుతో అలంకరించారు. ప్రతి ఏడాది నవరాత్రుల్లో శుక్రవారం అమ్మవారిని నగదుతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు, మున్సిపల్...