రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

--మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పూలను దైవంగా భావించి పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణ సొంతమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి,సంస్కృతి వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ మన అస్తిత్వానికి,మన తెలంగాణ జీవనశైలికి నిలువుటద్దం లాంటిదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ,రంగు రంగుల పూలను పేర్చి, గౌరమ్మను కొలిచే ఈ అద్భుతమైన వేడుక మన నేల...