Date of Publish : 21 October 2026, 4:02 pmPosted by : AKSHARA KALAM
భక్తి శ్రద్దలతో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం
మంగపేట, అక్టోబర్ 21: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగాములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాలలో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాల వద్ద బుధవారం ఉదయం ఆయా ఆలయాలలోని, మండపాలలోని అమ్మవారి విగ్రహాల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు ఆలయాలలో, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గా మాత విగ్రహాలను బుధవారం ఆయా గ్రామాలలో ఊరేగించి అనంతరం పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. మండలంలో దుర్గ మాత విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.