పిల్లల భవిష్యత్తు కోసం జీవితాలనే ధారపోసిన పెద్దలు..

వృద్ధాప్యంలో కోరుకునేది ఆస్తులు కాదు.. ఆప్యాయత అక్షర కలం/ ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం: కడుపున పుట్టిన బిడ్డ ఆకలితో ఉండకూడదని తాను పస్తులున్న తల్లి.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని చెమటను చిందించిన తండ్రి.. తమ ఆశలను పక్కనపెట్టి బిడ్డల ఆశయాలకు రెక్కలు తొడిగిన ఆ పెద్దలకు వృద్ధాప్యంలో కావాల్సింది. ఏమిటి? కోట్లు విలువ చేసే ఆస్తులా? ఖరీదైన కానుకలా? కాదు.. కాసింత ప్రేమ.. పలకరించే మనసు.. పక్కన నిలిచే మనిషి! జీవితమంతా పిల్లల కోసం పరితపించిన తల్లిదండ్రులు, వయసు మళ్లిన వేళ ఆత్మీయత...