గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ‘స్పాట్ అడ్మిషన్స్’

అక్షరకలం బిబినగర్

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలోని తెలంగాణ మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల డిగ్రీ మహిళా కళాశాల (హైదరాబాద్, మేడ్చల్) లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను తక్షణ ప్రవేశాల (స్పాట్ అడ్మిషన్స్) కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రాధ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
​– అందుబాటులో ఉన్న కోర్సులు…

​ఈ గురుకుల కళాశాలలో కింది కోర్సులలో ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ కళాశాలలో
​బి.ఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో ఎంపీసి, ఎంపీసీఎస్, ఎం ఎస్ డి ఎస్, ఎం ఎస్ సి ఎస్, ఏఐఎంఎల్, బి ఎఫ్ టి.
​బి.ఎస్సీ (లైఫ్ సైన్స్)లో ఎం బి జెడ్ సి, ఎన్ జెడ్ సి, ఏ ఎన్ బి సి, ​బిఏ లో ఈపిహెచ్, బి.కామ్ అనలైటిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఫ్యాషన్ కోర్సులు ఉన్నాయి.

—అర్హతలు ఇవే…

ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
​విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలి. ప్రవేశం పొందిన విద్యార్థినులకు ప్రభుత్వం తరఫున సదుపాయాలను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. పాఠ్యపుస్తకాలు,
​యూనిఫాం, ట్రాక్ సూట్ అండ్ దుప్పట్లు ఇస్తారు.
​ఆసక్తి, అర్హత గల విద్యార్థినులు బీబీనగర్ సమీపంలోని అన్నంపట్ల గ్రామంలో గల కళాశాల ప్రాంగణానికి నేరుగా హాజరై, ఈ నెల 10వ తారీఖు నుండి 13వ తారీఖు లోపు తమ దరఖాస్తులను సమర్పించి తక్షణ ప్రవేశాలు పొందవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రాధ స్పష్టం చేశారు.

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 'స్పాట్ అడ్మిషన్స్'
Comments (0)
Add Comment