పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాపై ఈసీ సమీక్ష

—జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితా తయారీలో భాగంగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాను రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఏ భాను ప్రకాష్ ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఓటరు జాబితా పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ -ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా రూపకల్పనకు జారీచేసిన షెడ్యూల్ పురోగతి, అలాగే షెడ్యూల్‌ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.

.

పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాపై ఈసీ సమీక్ష
Comments (0)
Add Comment