ప్రశాంతంగా.. వైభవంగా.. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయాలి 

అక్షరకలం దేవరకొండ: గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, వైభవంగా జరుపుకునేలా ప్రభుత్వ శాఖల అధికారులు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవరకొండ సబ్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర మార్గాల్లో విద్యుత్ తీగలు అడ్డు రాకుండా సరిచేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. తాగునీటి వసతి, స్పష్టమైన రోడ్డు మ్యాప్, వైద్య సేవలు, పారిశుధ్యం నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవరకొండ డిఎస్పీ, తహశీల్దార్, మత్స్య, వైద్య, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా.. వైభవంగా.. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయాలి
Comments (0)
Add Comment