ప్రకృతి విలయానికి విరిగిపడిన వంతెన గోడ

బతుకమ్మ ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని అందమైన అడవుల మధ్య వెలసిన ప్రతిష్టాత్మకమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణం లోని జలపాతం భక్తులను కనువిందు చేస్తుంది. భక్తులు లక్ష్మీ నరసింహుని దర్శించుటకు జలపాతంపై కట్టిన వంతెన గత రెండు రోజులుగా కురుస్తున్న ప్రకృతి విలయాతాండవానికి వంతెన గోడలు విరిగి నేలకొరిగాయి. ఎన్నో రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొంత ఊరట మొదలైంది. ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు,వాగులు, వంకలు, సెలయేర్లు పర్యాటకులను ఆకర్శించటమే కాకా పల్లె ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మోక్షం తో గొడ్డు,గోద పంట పొలాలు సుభిక్షంగా ఉండాలని మొక్కిన మొక్కులు పలించాయని ఆలయ దర్మ కర్త చెన్నవోయిన నర్సయ్య అన్నారు. కోరిన కోర్కెలను తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి విరిగిన వంతెన గోడలను నిర్మించుటకు ప్రీతి దాతలు, దైవ సంపన్నులు విరాళాలు ఇవ్వగలరని వారు కోరారు.

A broken bridge wall to nature
Comments (0)
Add Comment