కారును ఢీకొన్న బస్సు.. తృటి లో తప్పిన ప్రమాదం

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. గురువారం సాయంత్రం సిగ్నల్ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బస్సు డోరు కు తగలడంతో కారు అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో బస్సులోని ప్రనికులు ఒకసారిగా ఏం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రాణ భయంతో ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందకు దించారు. కాగా ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘటన జరిగిన సందర్భంలో ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సాధారణ సమయంలో మధ్యాహ్నం వేళా ఉదయం వేళల్లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వాహనాల తనిఖీలు చలనాలు వేస్తూ కేవలం పెనాల్టీ వేయడంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టకపోవడం విచారకరం. హడావిడి సృష్టించే ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి ప్రధాన బైపాస్ చౌరస్తా ప్రాంతంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు గాని, ఇతర పోలీసులు గాని రాత్రివేళలో ఆ ప్రాంతంలో నిలబెట్టి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇదే ప్రాంతంలో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ పోలీసుల్లో మార్పు రాకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వినిపిస్తున్నాయి.

A bus collided with a car.. an accident that was narrowly missed
Comments (0)
Add Comment