గోల్డ్ లోన్ పేరుతో టోపి పెట్టిన సైబర్ కేటుగాడి అరెస్టు

బతుకమ్మ, ఇందల్వాయి
మీరు బ్యాంక్ లో తీసుకున్న గోల్డ్ లోన్ తాలుకు ఈఎంఐ బ్యాంక్ లో వెంటనే కట్టాలని ఫోన్ చేసి 25 వేలు ఫోన్ పే చేయించుకుని మోసం చేసిన సైబర్ నేరస్తున్ని అరెస్టు చేసినట్లు డిచ్ పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. శనివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఇందల్వాయి మండలం స్టేషన్ తాండకు చెందిన బాదవత్ ఉపేంధర్ కు ఈ నెల 5న మంచిర్యాల జిల్లాకు చెందిన తిగుట్ల మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి మీరు బ్యాంక్ లో తీసుకున్న గోల్డ్ లోన్ తాలుకు డబ్బులు బ్యాంక్ లో వెంటనే చెల్లించాలని ఫోన్ చేశారు. లేకపోతే తాకట్టుపెట్టిన బంగారం సీజ్ చేస్తామని నమ్మించాడు. భయపడిన బాధితుడు మనోజ్ కు ఫోన్ పే ద్వారా రూ.25 వేలు చెల్లించారు. తర్వాత సంబంధిత డబ్బుల కోసం వివరాల కోసం అడిగితే ఫోన్ స్వీచ్చాఫ్ రావడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి మంచిర్యాల జిల్లాకు చెందిన మనోజ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై మనోజ్ కుమార్,సిబ్బంది ఉన్నారు.

A cyber peddler in the name of Gold Loan was arrested
Comments (0)
Add Comment