చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నారాయణ (38) అనే వ్యక్తి చేపలు వేటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందినట్లు ఏఎస్ఐ రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఎర్రోళ్ల నారాయణ నిన్న రాత్రి చేపలు పట్టడానికి రాయకూర్ గ్రామ చెరువులోకి వెళ్ళి అక్కడ చేపలు పడుతుండగా, ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందడం జరిగిందన్నారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ ఐ రాజు వెల్లడించారు.

A man died after going fishing
Comments (0)
Add Comment