నగరంలో మళ్ళీ మొదలైన గ్యాంగ్ వార్

. . . ఇండిపెండెన్స్ డే నాడు బైక్ ర్యాలీపై యువకుల దాడి

. . . పీటీ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం   

 పాతకక్షలతో యువకుడిపై ఓ గ్యాంగ్ దాడికి తెగబడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా  ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రోడ్డుపైనే అడ్డుకుని యువకుడిపై పిడుగుద్దులు గుద్దారు. ఈ ఘటన నగరంలోని 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం జాతీయ జండా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరంలోని 2వ టౌన్ పరిధిలోని నసీర్ హోటల్ చౌరస్తాలోని ఎంఐఎం కార్యాలయం ఎదుట బైక్ మీద వెళ్తున్న ఆటోనగర్ కు చెందిన మొహమ్మద్ జునేద్ అనే యువకుడు ర్యాలీగా బయలుదేరిగా అడ్డుకుని కొందరు యువకులు దుర్బాషలాడుతూ కర్రలతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మొహమ్మద్ జుమీద్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై దాడి చేసిన వారు ఆటోనగర్ కు చెందిన వారు కాంగ్రెస్ పుత్రరత్నంగా తెలిసింది. ఎంఐఎంకు చెందిన మరికొంత మంది యువకులతో కలిసి దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. యువకుడిపై దాడి చేసిన వారిపై పీడీఎస్ దందా కేసులతో పాటు బైక్ చోరి కేసులు ఉన్నట్లు తెలిసింది. అయితే బాధితుడు 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పొలీసులు మాత్రం సాధారణ పీటీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

A renewed gang war in the city
Comments (0)
Add Comment