హైదరాబాద్ లో జాబ్ చేస్తానని చెప్పి యువతి అదృశ్యం

బతుకమ్మ, నవీపేట్ : హైదరాబాద్ లో జాబ్ చేస్తానని చెప్పి ఇంటినుండి బయటకు వెళ్లిన యువతి అదృశ్యం అయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధి నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువతి ఒడ్డెపల్లి సింధూజ గత 15 రోజుల క్రితం హైదరాబాద్ లో జాబ్ చూసుకుంటానని చెప్పి ఇంటినుండి వెళ్లిన తరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని, ఇంతకూ ఆచూకీ లభ్యం కాకపోయేసరికి శనివారం సదరు యువతి తల్లి సునీత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నవీపేట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కే.వినయ్ తెలిపారు.

A young woman disappeared saying that she would get a job in Hyderabad
Comments (0)
Add Comment