* అధ్యక్షుడుగా గుగ్గిల సురేష్…
మంగపేట, ఆగస్టు 29 ( అక్షర కలం ) :
అంబేద్కర్ యువజన సంఘం మంగపేట మండల నూతన కమిటీని మండల కేంద్రమైన మంగపేటలోని అంబేద్కర్ భవనంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.ఐలయ్య, బి.నాగరాజు, జెబి. రాజు ఆదేశాల మేరకు పరిక శ్రీనివాస్ సభాధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం మండల, గ్రామ కమిటీలు రద్దు కావడంతో మండల నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం మంగపేట మండలం ఇంచార్జ్ , రాష్ట్ర ప్రచార కార్యదర్శి దీగొండ కాంతారావు, జిల్లా అధ్యక్షులు నక్క బిక్షపతి, డివిజన్ కన్వీనర్ గుండాల రఘు, జనగాం రవి, కర్రీ శ్యాంబాబు, బండారి చంద్రయ్య తదితరుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో కమిటీ ఎన్నుకున్నట్లు, త్వరలో గ్రామాలలో గ్రామ కమిటీల నిర్మాణం చేయనున్నట్లు నాయకులు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం మంగపేట మండల కమిటీ అధ్యక్షులుగా గుగ్గిల సురేష్, ప్రధాన కార్యదర్శిగా జానపట్ల జయరాజు, ఉపాధ్యక్షులుగా గాదె శ్రీనివాసచారి, ఎండి.ఇంతియాజ్ ( భుట్టో ), పూనెం రాములు, పూసల నరసింహారావు, ఎల్.పీ. సారయ్య, కార్యదర్శులుగా దూలగొండ సాంబశివరావు, గోనె నాగేష్, కలాల రాంబాబు, కొమరం రవికుమార్, జాడి రాంబాబు, ప్రచార కార్యదర్శులుగా మూగల రాము, వంకాయల నాగేశ్వరరావు, ఎర్రావుల సతీష్, గడ్డం ప్రశాంత్ , చెన్నూరు సాంబయ్య, కోశాధికారిగా యాసం హరీష్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన అంబేడ్కర్ అభిమానులు, అభ్యుదయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు