గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

బతుకమ్మ, నిజామాబాద్ క్రైo – గుండెపోటుతో ఒక ఎస్సై మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ లో చోటుచేసుకుంది. గాయత్రి నగర్ చెందిన దత్తాద్రి ( 52) నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. ఉదయం వేళ వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

ASI died of heart attack
Comments (0)
Add Comment