న్యూఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బినోల విద్యార్థిని ఎంపిక

బతుకమ్మ బోధన్ : 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గోనడానికి బినోల పాఠశాలకు చెందిన 10 వ తరగతి విద్యార్థిని కె. భవానిక ఆహ్వానం లభించినదని స్కూల్ ప్రదానోపాధ్యాయులు మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ లోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొనడానికి విద్యార్థిని భవాని ఢిల్లీ వెళ్లిందని, ఇటీవల జాతీయ స్థాయిలో ప్రేరణ అనే కార్యక్రమంలో ఎంపికై గుజరాత్లో ప్రధాని నరేంద్రమోది విద్యను అభ్యసించిన పాఠశాలలో 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగినదని ప్రదానోపాధ్యాయుడు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకలకు జిల్లా నుండి ఏకైక విద్యార్థి ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఎంపిక కొరకు సహకరించిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ బుర్ర వెంకటేశం, డీఈఓ దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు, తల్లితండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Binola student selected for Independence Day celebrations at New Delhi's Red Fort.
Comments (0)
Add Comment