ప్రతి గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలి

రుద్రూర్, (బతుకమ్మ) : రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం బిజెపి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ మండలం ఇంచార్జ్ మోహన్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, సాయినాథ్, పార్వతి మురళి, రాజారామ్, శానం బాలు, మండల నాయకులు, శక్తీ కేంద్రం ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

BJP membership registration program should be conducted in every village
Comments (0)
Add Comment