ఈనెల 29న ఖమ్మంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుని పర్యట.

పర్యటనను విజయవంతం చేయండి.
• బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి పిలుపు.

అక్షర కలం/ ఖమ్మం:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు
రామచంద్ర రావు ఈనెల 29వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారనీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తెలియజేశారు. ఆదివారం నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా 29 న ఉదయం 8 గంటలకు జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద వారికి జిల్లా భాజాపా శ్రేణులు స్వాగతం పలుకుతారు. అక్కడనుండి కూసుమంచిలోని శివాలయం కు 9 గంటలకు చేరుకొని పూజా కార్యక్రమం లో పాల్గొంటారు. ఖమ్మం నగరంలోని కాల్వడ్డు నుండి 10 గంటలకు నిర్వహించే బైక్ ర్యాలీ లో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నగరంలోని సప్తపది ఫంక్షన్ హాల్ లో 11 గంటలకు నిర్వహించే పబ్లిక్ మీటింగ్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని సూర్య తేజ హోటల్లో మేధావులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.

BJP state president's visit
Comments (0)
Add Comment