*జర్నలిస్టు సాంబశివరావు మృతికి సంతాపం* 

* పలువురు నేతల నివాళి

* టీడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో కుటుంబానికి ఆర్థిక సహాయం

* శోకసంద్రమైన కామేపల్లి

అక్షర కలం వెబ్ / కామేపల్లి: 

కామేపల్లి మండల కేంద్రంలో మీసేవ నిర్వహిస్తూ… విలేకరిగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ముక్తి సాంబశివరావు ( 40) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన స్వగృహంలో ఉంచిన భౌతిక కాయాన్ని వివిధ పార్టీల నాయకులు, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సందర్శించారు. సాంబశివరావు మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన మీసేవ ద్వారా దాదాపుగా ఉచిత సర్వీస్ అందిస్తూ అందరి తలలో నాలుకలా ఉండే సాంబశివరావు ఆకస్మికంగా మృతి చెందటం స్థానికులను కలచివేసింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే జనం భారీగా తరలివచ్చారు.

*టీడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో రూ.1.30 లక్షల ఆర్థికసాయం

సాంబశివరావు మరణ వార్త తెలిసిన వెంటనే టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, జానీపాష ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జర్నలిస్ట్ సాంబశివరావు కుటుంబస్థితిగతులను చూసి పలువురు ప్రముఖులతో మాట్లాడి రూ. 1.30 లక్షల ఆర్థిక సహాయం చేయించారు. వారికి కాంగ్రెస్ జిల్లా నాయకులు, రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు చరణ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు సహకరించారు. గిరిజన జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలబడిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలను అభినందించారు.‌

* సంతాపం తెలిపిన నేతలు..

జర్నలిస్ట్ సాంబశివరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయనతో పాటు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, తోటకూరి శివయ్య, ధనియాకుల హన్మంతరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బావ్ సింగ్, మాజీ సర్పంచ్ అజ్మీరా రామదాస్, మాజీ ఎంపిటిసి సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య, జర్నలిస్టులు కోటగిరి రాము, తెల్లబోయిన రాము, కె.గోపి, ఎస్కే ఇబ్రహీం, చిలుముల శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Condolences on the death of journalist Sambasivarao
Comments (0)
Add Comment