పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలి

  • మళ్ళీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • చెరువులు, కుంటాలను అధికారులు పర్యవేక్షించాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, భీంగల్ – గత నాలుగైదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల దరిమిలా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకుగాను గురువారం నియోజకవర్గ పర్యటన అనంతరం ఎమ్మెల్యే బాల్కొండ క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గ రెవిన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారుల ద్వారా నియోజకవర్గం లో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోయినందున మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపత్యంలో ఇరిగేషన్ అధికారులు రోజు వారిగా చెరువులు, కుంటల పర్యవేక్షణలో ఉండాలన్నారు. మెండోరా మండలం బుస్సాపూర్ లో సుమారు 40 ఎకరాల వేరుశనగ పంట, వేల్పూర్ మండలం మోతె లో 10 ఎకరాల వరి పంట, పచ్చలనడుకుడ గ్రామంలో 5 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని ఆ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అధికారులు ఎమ్మెల్యేకు వివరించగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ మోర్తాడ్ మండల కేంద్రంలోని మొండి వాగులో గాళ్లంతై, మృతి చెందిన కామరెడ్డికి చెందిన రైతు కూలీకి సంబందించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ వర్షాలు రానున్న కారణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేసి నియోజకవర్గం లో ఎలాంటి ఆస్థి, పంట, ప్రాణ నష్టం సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ అధికారులు అధికార సమీక్ష సమావేశం లో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏడీఏ శ్రీనివాస రాజు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్ డీ ఈ లు, ఏ. ఈ లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Crop damage should be reported to the government
Comments (0)
Add Comment