ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల బాధ్యత అతి కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

సూర్యాపేట, ఆగస్టు, 30 (అక్షర కలం) ప్రతినిధి :

శనివారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూజిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు 1995 లో డిప్యుటీ తహసీల్దార్ గా ప్రయాణం మొదలు పెట్టి గత 7 సంవత్సరాలుగా అదనపు కలెక్టర్ గా కుటుంబ సభ్యుల సహకారం తో,నిబద్దత తో విధులు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రజలకి సేవ చేయటం చాలా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ కొనియాడారు.
సంక్షేమ పథకాలలో ముఖ్యమైనవి హుజూర్ నగర్ నుండి సన్న బియ్యం పంపిణి, తిరుమలగిరి నుండి రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అదనపు కలెక్టర్ సహకారం తో జిల్లాలో విజయవంతం చేశామని అన్నారు.
అదనపు కలెక్టర్ ని సమన్వయము చేసుకుంటూ గత యాసంగి ధాన్యం కొనుగోలు సమయంలో ఆకస్మిక వర్షాలు కురిసిన రైతులకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించామని అలాగే సీ ఎం ఆర్ డెలివరీ లు కుడా వేగవంతంగా పూర్తి చేయటం జరిగిందని తెలిపారు.
భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి లో పర్యటనలుచేసి భూ సమస్యలు పరిష్కరించటంలో ఎంతగానో కృషి చేశారు.
మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యలతో, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నాని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు

పదవి విరమణ పొందుతున్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తన అనుభవాలు స్మరించుకుంటూ జీవితంలో కష్టే ఫలి అని నమ్మి డిప్యుటీ తహసీల్దార్ గా మొదలైన ప్రయాణం గత 7 సంవత్సరాలుగా ఐదు జిల్లాలలో అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహించానని, నా జీవితం లో 26 కలెక్టర్ల వద్ద విధులు నిర్వహించానని తన 30 ఏళ్ల చరిత్రలో ప్రజలకి పనికొచ్చే ఏ విషయంలో పెండింగ్ పెట్టకుండా విధులు నిర్వహించానని, మనం చేసే విధుల ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. తన ఉద్యోగ రీత్యా విధులకు సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

ఆర్డీఓ లు వేణుమాదవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, జడ్పీ సి ఈ ఒ వివి అప్పారావు, జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

 

District Collector Tejas Nand Lal Pawar said the responsibility of the employees is critical to the implementation of government development and welfare programs
Comments (0)
Add Comment