ఆహార భద్రత చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలి-రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.

 

అక్షర కలం/ ప్రతినిధి:

గురువారం సూర్యాపేట జిల్లాలో ఫుడ్ కమిషన్ పర్యటన సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి సమీక్షించారు.
సూర్యాపేట జిల్లాలో ఆరోగ్యం, స్కూల్స్, హాస్టల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఇక్కడ ఆహార భద్రత చట్టాన్ని బాగా అమలు చేస్తున్నారని, ఇలాగే ఇతర జిల్లాల్లో అమలు చేస్తే తెలంగాణ ఆహార భద్రత చట్టం పూర్తిగా అమలు చేసిన వారం అవుతామని, పేదరికం పోవాలంటే చదువు ముఖ్యమని అన్నారు. రేషన్ షాపులలో డీలర్లు వేయింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంగన్వాడి కేంద్రాలలో ఎగ్స్, పాలు, బాలామృతం అట వస్తువులు, సక్రమంగా సరఫరా చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించడం జరుగుతున్నదని, అంగన్వాడి కేంద్రాలలో గుడ్లు, పాలు, బాలామృతం సక్రమ సరఫరా అమలు చేస్తామని, స్కూల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్, తదితర పరీక్షలు చేయించడం జరుగుతున్నదని తెలిపారు.
తదుపరి ఫుడ్ కమిషన్ చైర్మన్ ను, కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డి ఆర్ డి ఏ పి డి వి. వి. అప్పారావు, సంక్షేమ శాఖల అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ఎంఈఓ లు,
హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Food Safety Act should be strictly implemented in the district-State Food Commission Chairman Goli Srinivas Reddy.
Comments (0)
Add Comment