- రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరం.
- ప్రతిపక్ష అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసగింపుకు గురికావద్దు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ : గుత్తా సుఖేందర్ రెడ్డి.
- నల్గొండ పట్టణం (అక్షర కలం) : రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాట్లాడే భాష చాలా ఘోరంగా ఉందని, ప్రతిపక్ష,అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసాగింపుకు గురికావద్దని చెప్పారు.నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామం అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రికి,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాజకీయ పార్టీలు ఎన్నికలలో వేల కోట్లు డబ్బులు ఖర్చుపెడుతున్నారనీ,. దీంతో అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతుందనీ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలను నియంత్రించాలన్నారు.తెలంగాణ లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు అన్ని పనులలో ఎక్కువగా ఉన్నారనీ,వ్యవసాయ కూలీలు సైతం భీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నారనీ పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దన్నారు.ఉచితాలు తగ్గించి, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని.రాజకీయ పార్టీల వైఖరి తో అధికారుల్లో అత్యంత అవినీతి పెరిగిందనీ పేర్కొన్నారు.వేల కోట్లున్న జయలలిత,రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఎం తీసుకుపోలేదని తెలిపారు.ఎన్నికల సంఘం,సుప్రీం కోర్టు,కేంద్రం అవినీతిపై ద్రుష్టి సారించాలని,ఎన్నికల్లో ఖర్చు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్రాస్ కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ ల అనుసంధానం జరిగిందని,ఇచ్చంపల్లి నుండి నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తే తెలంగాణ కు మేలు జరుగుతుందన్నారు.