*వలిగొండలో భారీ వర్షం… తడిసి ముద్దైన ధాన్యం…*

– చేతికి వచ్చిన పంట నీళ్లపాలు

– కల్లాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం

*వలిగొండ అక్టోబర్ 13( అక్షరకలం వెబ్ )*:

యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు వలిగొండ మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులను నిలువునా ముంచింది.భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తం నీటిపాలుకాగా అపార నష్టం వాటిళ్లింది.వరుణుడి భారి నుంచి రైతు తప్పించుకో లేకపోయాడు.వలిగొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.చేతిక వచ్చిన పంట నీళ్లపాలు కావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీతం కారణంగా నీటిపాలుకాగా,రైతులకు కోలుకోలేని విధంగా నష్టాన్ని కలిగించింది.సోమవారం తెల్లవారుజామున కురిసిన కుంభవృష్టి వర్షం రైతుల పాలిట శాపంగా మారింది.

మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం,వరద దాటికి పక్కనే ఉన్న రాచకాలవలోకి కొట్టుకుపోయింది.మార్కెట్ యార్డ్ లో ఎక్కడ చూసినా కొట్టుకుపోయిన ధాన్యమే దర్శనమిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..నష్టపోయిన తమకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు..

 

 

 

Comments (0)
Add Comment