వీరవనితలను ఆదర్శంగా తీసుకోవాలి

. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

. చాకలి ఐలమ్మకు ఘన నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నేటి మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ, ఝాన్సీ రాణి వంటి వీర వనితల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వినాయక నగర్ లోని ఐలమ్మ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకువచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో బీసీ డెలప్ మెంట్ ఆఫీసర్ స్రవంతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, ఆనంద్, పవన్, కిరణ్, భూమేశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

Heroes should be taken as an example
Comments (0)
Add Comment