అక్రమంగా వేసిన రేకుల షెడ్ ను వెంటనే తొలగించాలి

రుద్రూర్,  బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో అదే గ్రామానికి చెందిన కొట్టాల నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా రేకుల షెడ్ వేశాడని, ఈ రేకుల షెడ్ ను వెంటనే తొలగించాలని రుద్రూర్ గ్రామానికి చెందిన సురాజ్ శ్రీనివాస్ (వర్ని మండలం మన తెలంగాణ రిపోర్టర్) మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సురాజ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొట్టాల నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా రేకుల షెడ్ వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రేకుల షెడ్ యొక్క ఫోటోలు, వీడియోలు తీయడంతో నాపై ముగ్గురు వ్యక్తులు దౌర్జ్యనం చేస్తు, దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కావున ఈ విషయం పై తహసీల్దార్ వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేసిన రేకుల షెడ్ ను వెంటనే తొలగించాలని ఆయన కోరారు.

Illegally shed petals should be removed immediately
Comments (0)
Add Comment