ఆయిల్ పామ్ తోటల సాగుతో నెలసరి ఆదాయం పొందాలి 

అక్షర కలం :ప్రతినిధి: మోతే జులై 25

  • జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య
  • వరికి ప్రత్యామ్నాయంగా

దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసిరైతులు నెల నెల ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య పతంజలి ఆయిల్ కంపెనీ తెలంగాణా డి జి ఎం బి యాదగిరి కూడా అన్నారు.శుక్రవారం మండల పరిధిలో ని సిరికొండ గ్రామం లో నూతనంగా ఆయిల్ పామ్ సాగుచేస్తున్న దామిడి గోపాల్ రెడ్డి వ్యవసాయక్షేత్రం లో మేఘ ప్లాంటేషన్ కార్యక్రమం లో మొక్కలు నాటే కార్యక్రమంను వారు ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ

ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు.

ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు.

నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.. ఆయిల్ పామ్ పంటకు కోతుల, దొంగల బెండదా ఉండదని, చీడ, పిడలు కూడా తక్కువగా ఉంటాయని అన్నారు. పండిన పంటను కంపెనీ వారే కొనుగోలు చేస్తారని మార్కెట్ సమస్య ఉండదన్నారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న

ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయలని కోరారు.. ఈ కార్యక్రమంలో, జూనియర్ మేనేజర్ శశి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్,

క్షేత్ర సహాయకులు పి శివశంకర్, పలువురు రైతులు పాల్గొన్నారు.

Income from oil plantation cultivation
Comments (0)
Add Comment