30డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ , నిజామాబాద్ బ్యూరో – నగరంలోని 30 వ డివిజన్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం డివిజన్ లో జాతీయ పతాకాన్ని ఎం ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం. డి. ఫిరోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. స్వాతంత్ర కోసం పోరాడిన అమరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం ఎం. డి. ఫిరోజ్ డివిజన్ ప్రజలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్ పెద్దలు ఎం.ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు గాను ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎండి ఫిరోజ్ కు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె జలీల్, ఎస్.కె.అమీర్ , ఎస్. కె. ఖాజా, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Independence Day celebrations in 30 division
Comments (0)
Add Comment