*తాగిన మైకంలో పోలీసు అధికారుల విధులకు ఆటంకం పరుస్తూ, అర్ధరాత్రి ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తి పై కేసు నమోదు*

నల్లగొండ/ అక్షర కలం ప్రతినిధి :

నల్గొండ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి సుమారు 11.00 గంటల సమయములో నల్గొండ పట్టణ నివాసి అయిన రావిళ్ల నర్సింహా తండ్రి తిరుపతయ్య, వ. 40 సం.లు, కులము కమ్మ అను అతడు త్రాగిన మత్తులో మోటార్ సైకల్ నడుపుకుంటా వెల్లుచుండగా, రాత్రి విధులలో ఉన్న జె. సైదులు SI గారు DVK రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా, నర్సింహా కు 155mg/100ml ఆల్కహాల్ రీడింగ్ వచ్చినది. అది దృష్టిలో పెట్టుకొని, సదరు రావిళ్ల నర్సింహా పోలీసువారి విధులను నిరోదించు (ఆటంక పరచాలనే) ఉద్దేశ్యముతో, తన శరీరముపై ఎక్కడో పెట్రోల్ పోసుకొని రాత్రి సుమారు 11.30 గంటలకు నల్గొండ 1 టౌన్ పోలీసు స్టేషన్ మెయిన్ గేట్ లో నుండి లోపలికి వస్తుండగా, అక్కడే పార్కింగ్ స్టలంలో ఉన్న హోంగార్డ్ ప్రవీణ్, ఎవరు నువ్వు, ఏమైంది, అని అడుగుతూ అతని దగ్గరికి వెళ్తుండగా, తన పైనే డ్రంకెన్ డ్రైవ్ కేసు వేస్తారా అంటూ, ముందుగానే తన వెంట తెచ్చుకున్న లైటర్ తో తనకి తాను కాల్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అది గమనించిన ప్రవీణ్ ఆపడానికి వెళ్ళగా, కాల్చుకునే క్రమంలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో, వెంటనే విధులలో ఉన్న అంజత్ కానిస్టేబుల్ బెడ్ షీట్ కప్పి మంటలు ఆర్పి, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే అతని ప్రాణాలు కాపాడాలని, చికిత్స గురించి ఆసుపత్రి కి తరలించడము జరిగింది. ఈ క్రమంలో ప్రాణాలకి తెగించి అతనిని కాపాడటానికి ప్రయత్నించిన హోంగార్డ్ ప్రవీణ్ చేతులకి గాయాలయ్యాయి.

ఇట్టి విషయములో పోలీస్ అధికారుల విధులని నిరోధిస్తూ, అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహత్య యత్నం చేసిన రావిళ్ల నర్సింహా పై కేసు నమోదు చేసి విచారణ జరుపుచున్నట్లు నల్గొండ 1 వ పట్టణ ఇన్స్ పెక్టర్ A. రాజ శేఖర్ రెడ్డి గారు తెలిపారు.

ktipai kēsu namōdu. A case has been registered against a person who obstructed duty.at. nalgonda
Comments (0)
Add Comment