బిచ్కుందలో బిలాల్ హార్డ్వేర్ ప్రారంభం

బతుకమ్మ:బిచ్కుంద : బిచ్కుంద మండలం కేంద్రంలో‌ అధునాతన హంగులతో సరి కొత్తగా రూపొందించుకున్న బిలాల్ హార్డ్వేర్ అట్టహాసంగా ప్రారంభమైంది. బిచ్కుంద పట్టణం రాజుల్ల చౌరస్తాలో నూతనంగా నిర్మించిన బిలాల్ హార్డ్వేర్ షాపును గురువారం జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బిలాల్ హార్డ్వేర్ షాప్ నందు కలియ తిరిగారు. కౌంటర్ పై కూర్చుని కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కస్టమర్లతో ఆయన సరదాగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిచ్కుంద పట్టణం నందు బిలాల్ హార్డ్వేర్ షాపును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అన్ని రకాల గృహ నిర్మాణ అవసరాలకు అనుకూలమైనదని చెప్పారు. బిలాల్ హార్డ్వేర్ షాపింగ్ యాజమాన్యం మాట్లాడుతూ… బిచ్కుంద మండల ప్రజలకు నాణ్యమైన అన్ని రకాల గృహ నిర్మాణ (గృహాలంకరణ) వస్తువులు సరసమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ తో పాటు బిలాల్ హార్డ్వేర్ షాప్ యాజమాన్యం,పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, షేక్ పాషా సెట్, బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ మరియు ఇతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Launch of Bilal Hardware in Bichkunda
Comments (0)
Add Comment