బతుకమ్మ, నిజామాబాద్ : భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కు భారత సుప్రీంకోర్టు సిబిఐ,ఇడి కేసులలో బెయిలు మంజూరు చేయడం,జైలు నుండి విడుదల అయిన నేపథ్యంలో నిజామాబాద్ న్యాయవాదుల ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు.జిలాకోర్టు లోని బార్ అసోసియేషన్ హల్ లో న్యాయవాదులు మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారాస లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు మాట్లాడుతూ కుట్రదారుల కుట్రలను ఛేదించి ,కుట్రదారుల కు ఒక గుణపాఠం నేర్పిన తీర్పు వెలివడిందని అన్నారు. రాజకీయ ప్రేరితమైన కేసులను భవిష్యత్ లో పేర్కొన్నారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించే విదంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని తెలిపారు. సిబిఐ, ఈడీ కేసులలో దర్యాప్తు సంస్థల లోపభూయిష్ట తీరు బయట పడిందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, గిరిదర్ రావు,ఎన్. ఎల్ శాస్త్రి ,కిరణ్ కుమార్ గౌడ్,రాజశేఖర్ రెడ్డి, వినాయక్,రత్నాకర్ రెడ్డి,బాగిర్తి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.