ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మరికల్ లో పండ్ల పంపిణీ…..

 

,నారాయణపేట, అక్టోబర్ 2, (అక్షర కలం వెబ్):

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మరికల్ ఆర్యవైశ్య సంఘం, మరికల్ వాణిజ సంఘం, వివిధ పార్టీల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జయంతిని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరికల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శెట్టి రమేష్, శెట్టివెంకటేష్, కడుమూరు శ్రీనివాసులు, నాగరాజు, వాణిజ్య సంఘం అధ్యక్షులు ఆనంద్ కుమార్, అఖిలపక్ష నాయకులు సూర్య ప్రకాష్, బేలగొంది వీరన్న, హరీష్ కుమార్, గొల్ల కృష్ణయ్య, అల్లా బాకాష్, గొల్ల రాజు, బొంత మొగులయ్య, కాజా పాషా,శెట్టి యాదగిరి, గొల్ల ఆంజనేయులు, భాష తదితరులు పాల్గొన్నారు .

Mahatma Gandhi Jayanti Celebrations Distribution of fruit in Marikal .....
Comments (0)
Add Comment