మున్సిపల్ కార్మికులకు మాస్కులు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కమిషనర్ మంద మకరంద్ మాస్కులను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ వెయ్యి మాస్కులనుసమకూర్చగా బుధవారం ఉదయం గోల్ హనుమాన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ పంపిణీ చేశారు. హెల్త్ క్యాంపుల నిర్వహణ కోసం లయన్స్ సహకారం తీసుకుంటామని ఆయన అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, అడిషనల్ కమిషనర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ సునీల్, జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.

Masks for municipal workers
Comments (0)
Add Comment