కాలువలో పడ్డ ఎంపీడీఓ భద్రు నాయక్

ఎంపీడీఓకి త్రుటిలో తప్పిన ముప్పు,

 

మంగపేట, ఆగస్టు 18 ( అక్షర కలం ) : ములుగు జిల్లా మంగపేట ఎంపీడీఓ బానోత్ భద్రు నాయక్ కు సోమవారం త్రుటిలో ముప్పు తప్పింది. మంగపేట మండలంలోని కమలాపురంలో లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భగత్ సింగ్ కాలనీలో ఇండ్ల చుట్తో చేరిన వరద నీటిని పరిశీలించేందుకు నడిచి వెళ్తున్న ఎంపీడీఓ భద్రు నాయక్ సైడు కాలువలో జారి పడ్డాడు. గమనించిన తోటి అధికారులు, సిబ్బంది, స్థానికులు వెంటనే ఎంపీడీఓ భద్రు నాయక్ ను పైకి లేపారు. కాగా సైడు కాలువలో జారి పడడంతో ఎంపీడీఓ భద్రు నాయక్ కి గాయాలు అయ్యాయి.

 

 

MPDO Bhadra Nayak in the canal
Comments (0)
Add Comment