శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్                                                     

                                           

 అక్షర కలం సిద్దిపేట ఫిబ్రవరి 22:

సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం పాలమకుల గ్రామంలో యాదవ కుల బంధువుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ యాదవ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానము మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవును శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఈ దైవ కార్యములో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని ఆ శ్రీకృష్ణుని వేడుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంగునూర్ మండలం కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments (0)
Add Comment