లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ ఎస్పీ

సింపుల్… అండ్ సెన్సిటివ్ ఆఫీసర్…నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్ ప్రత్యేక మార్క్సు

సుమారు రెండేళ్ల పాటు పేట ఎస్పీగా విధులు

కమ్యూనల్ వైలెన్స్ సమయంలో కీ రోల్

పేట జిల్లా నూతన ఎస్పీ గా డా. జి . వినీత్

నారాయణపేట జిల్లా ప్రతినిధి సయ్యద్, సెప్టెంబర్ 27, (అక్షర కలం వెబ్ ):

ఐపీఎస్ అధికారి అంటే ఇంత సింపుల్ గా ఉంటాడా అనడానికి నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ పేరును చెప్పవచ్చు. తాను ఎస్పీగా చేరినప్పటి నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయడంలో ఎంతో కృషి చేశాడని చెప్పవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ అధికారిగా కొనసాగారు. 2023 అక్టోబర్ 13న నారాయణపేట జిల్లా ఎస్పీగా యోగేష్ గౌతమ్ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు రెండు సంవత్సరాలపాటు నారాయణపేట ఎస్పీగా పని చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరిగి డీజీపీ వరకు సమాచారం చేరితే రాత్రికి రాత్రే నారాయణపేట జిల్లా కేంద్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ పాత్ర ఎంతో ఉందని చెప్పక తప్పదు. అలాగే జిల్లాలో అసెంబ్లీ ఎంపీ సజావుగా జరిగేందుకు ఎస్పీ యోగేష్ గౌతం ఎంతో కృషి చేశారు. యోగేష్ గౌతమ్ ఎస్పీ బదిలీ స్థానంలో (2017 ఐపీఎస్) మాదాపూర్ డిసిపి గా పని చేసిన వినీత్ నారాయణపేట జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.

No Compromise SP in case of Law and Order
Comments (0)
Add Comment