పేకాట స్థావరంపై పోలీసుల దాడి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దుబ్బ ప్రాంతంలో పేకాట స్థావరం పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఇందులో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8,430/- రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు, స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇదే కేసులో 6 గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట అడుతున్నట్లైతే అట్టి సమాచారాన్ని టౌన్ 3 పోలీస్ స్టేషన్ ఎస్సై 8712659839 సెల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఇంకా పడుతుందని వారు ప్రజలకు భరోసా ఇచ్చారు.

Police raid on poker base
Comments (0)
Add Comment