రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులను మంజూరు….

అక్షర కలం  /ప్రతినిధి :

పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులను మంజూరు చేసిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.
శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండల కేంద్రంలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు .
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నదని, అంతేకాక రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తున్నదని ,గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని,తమ ప్రభుత్వం నీరుపేదలకు నూతన రేషన్ కార్డులు ఇస్తున్నదని చెప్పారు. శాలిగౌరారం మండలంలో ఇప్పటివరకు కొత్తగా 2017 రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, 9806 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .
నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి మాట్లాడారు.
శాలిగౌరారం తహసిల్దార్, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments (0)
Add Comment