కవితకు బెయిల్ మంజూరి పట్ల నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

. . . బీఆర్ఎస్ మహిళ నాయకురాలు తేలు సరిత

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వికుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్ మహిళ నాయకురాలు తేలు సరిత ఆధ్వర్యంలో నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో మహిళలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలకు ముందు ఈడి ద్వారా కేసు పెట్టించి అక్రమ కేసులు పెట్టి మానసిక శోభకు గురి చేశారన్నారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు. పూజలో పాల్గొన్న వారిలో గంట జ్యోతి, బెజ్జంగి సుమలత, అల్వాల్ బుచ్చమ్మ, గంగవ్వ, శోభ, లావణ్య, రేణుక, యశోదలున్నారు.

Special pooja at Neelakantheswara Temple for the grant of bail to Kavitha
Comments (0)
Add Comment