జేసీఐ అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం 

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఇందూరు యువత  కార్యాలయంలో జేసీఐ అలుమ్ని క్లబ్  ఆద్వర్యంలో 15 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. గురువారం జేసిఐ అలుమ్ని క్లబ్ జోన్ చైర్మన్ జీవీఎన్ రాజు పంపిన  పత్రాలతో, శాలువాలతో 3వ టౌన్ ఎస్సై మహేష్ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలుమ్ని క్లబ్ క చైర్మన్ బంగారి వీర బ్రహ్మం, క్లబ్ మెంబర్ విజయానంద్, జోన్ కో-ఆర్డినేటర్ నయాన్, పురుషోత్తం రెడ్డి,ఇందురు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Teachers felicitated by JCI Alumni Club
Comments (0)
Add Comment