తెలంగాణ బోనాలు ప్రపంచంలోనే అత్యంత చారిత్రాత్మకం:

రాజ్యసభ సభ్యుడు
అనిల్ కుమార్ యాదవ్.

హైదరాబాద్: ( అక్షర కలం)
తెలంగాణ బోనాలు ప్రపంచం లోనే చారిత్రాత్మక వేడుక అని రాజ్యసభ సభ్యులు మందడి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఎల్భీ స్టేడియమ్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోఛ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మందడి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్భీ స్టేడియం లో బోనాలు వేడుకలు నిర్వహించిన
తెలంగాణ స్పోర్ట్స్ కోఛ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దొంతి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజ శేఖర్ రెడ్డిని అభినందించారు. అదే విధంగా రాష్ట్ర స్పోర్ట్స్ కోఛ్స్ సమస్యలను ముఖ్యమంత్రి తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

*ఎల్భీ స్టేడియం లోని అమ్మ వారికి
బోనం సమర్పించిన శాట్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ సోని బాలాదేవి*

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ సోనీ బాలాదేవి స్వయంగా బోనం ఎత్తుకొని ఎల్భీ స్టేడియం లోని
అమ్మ వారికి బోనం సమర్పించి
అమ్మవారి దీవెనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ కోఛ్స్ లు సైతం జరిగిన బోనాల వేడుకలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎం.డి. సోనీ బాలాదేవి మాట్లాడుతూ, తెలంగాణ సాంప్రదాయ బోనాల లో అమ్మవారి బోనం ఎత్తుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇంకా ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోషియేషన్ ప్రతినిధులు బాబురావు సాగర్ మహేశ్ కుమార్, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ జగన్నాథం, తెలంగాణ జన సమితి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ, టి ఎనర్జీ అధ్యక్షుడు క్రృష్ణా యాదవ్, కాంగ్రెస్ నాయకులు మమత
సంతోష్ గుప్తా, కోచ్స్ సంఘం ప్రతినిధులు సత్యవాణి, బోనాల నిర్వాహకులు దొంతి వినోద్ కుమార్ గౌడ్, గోకుల్, రాజశేఖర రెడ్డి పోచప్పా తదితరులు పాల్గొన్నారు.

Telangana Bonalu is historic
Comments (0)
Add Comment