బతుకమ్మ,మోర్తాడ్ : పేదవారికి కడుపునిండా అన్నం పెట్టాలని సదుద్దేశంతో ఆకలి చావులేని దేశంగా తయారు చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ఉచిత బియ్యం పథకాన్ని పక్క త్రోవ పట్టిస్తూ మోర్తాడ్ మండల కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో యధేచ్ఛగా జరుగుతోందని బిజెపి మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఉప్పల నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్ధరాత్రి పూట జరిగే ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కమిషన్ల కక్కుర్తి కోసమే ఈ మాఫియా కి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై, రెవిన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ఇకనైనా అధికారులు అక్రమంగా బియ్యం కొనుగోలు చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల కచ్చితంగా బిజెపి పార్టీ మోర్తాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్రమార్కులకు సహాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాలకు ఆహార ధాన్యాల లభ్యత, స్థోమత లభ్యతను బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) అనేది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలను అందించడం ముఖ్య ఉద్దేశం, కావున ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతాపార్టీ, డిమాండ్ చేస్తోందని అన్నారు.