నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు

అక్షర కలం /ప్రతినిధి :
మంగళవారం ఆమె నాంపల్లి పి హెచ్ సి ని ఆకస్మిఖంగా తనిఖీ చేసి ఓ పి,
ఏ ఎన్ సి కేసులు,డ్రగ్స్ తదితర రిజిస్టర్లు తనిఖీ చేశారు.ఆసుపత్రిలో ఈ నెల నిర్వహించిన ప్రసవాల గురించి అడుగగా 2 ప్రసవాలు నిర్వహించినట్టు పి హెచ్ సి డాక్టర్ భవాని కలెక్టర్ కు తెలిపారు. రోగులు వారి సహాయకులకు కల్పిస్తున్న ఆరోగ్య విద్య ,పౌష్టికాహారం,తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.పి హెచ్ సి కి సమావేశ మందిరం కావాలని కోరగా 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.ఆసుపత్రిలో నాటిన మొక్కలను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తెలంగాణ మోడల్ స్కూల్,జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు.పాఠశాలలో పరిశుభ్రత,వంటగది,డైనింగ్ క్లాస్ రూమ్స్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాసామర్థ్యాలు పరిశీలించారు.పాఠశాలకు కిచెన్ కావాలని కోరగా మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.కాగా ఈ పాఠశాలకు డైనింగ్ ఇదివరకే మంజూరు చేసిన విషయం తెలిసిందే.
చండూరు ఆర్డీవో శ్రీదేవి,
పి హెచ్ సి వైద్యురాలు డాక్టర్ భవాని, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్,తదితరులు ఉన్నారు.

The district collector said that Nampally will provide infrastructure at the Primary Medical Center
Comments (0)
Add Comment