ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేసిన వైద్య అధికారులు

బతుకమ్మ భిక్కనూర్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భిక్కనూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు శనివారం సీజ్ చేశారు. డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కిరణ్, మండల వైద్యురాలు హేమీమా ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం సాయంత్రం ఒక వ్యక్తికి చికిత్స నిర్వహించగా వైద్యం వికటించి అతడు మృతి చెందాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని పరిశీలించాం. మృతి చెందిన స్వామికి చికిత్స నిర్వహించిన వ్యక్తికి ఎలాంటి అనుమతి లేదని, పూర్తి విచారణ అనంతరం ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

The medical officers who seized the private hospital
Comments (0)
Add Comment