మంగపేట, సెప్టెంబర్ 20 ( అక్షర కలం,వెబ్ ):
నేటి సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని మంగపేట ఎస్సై టీ. వీ. ఆర్. సూరి అన్నారు. శనివారం మంగపేట పోలీస్ స్టేషన్ లో మండలంలోని జర్నలిస్టులతో ఎస్సై టీ. వీ. ఆర్. సూరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న తప్పులను మీడియా ద్వారా చూపించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
వాస్తవాలను వెలుగులోకి తెచ్చినప్పుడే మీడియా విలువ పెరుగుతుందని అన్నారు. అవాస్తవాలు, తప్పుడు సమాచారంతో మీడియాలో న్యూస్ వస్తే అలాంటి మీడియా విలువ సమాజంలో తగ్గుతుందని అన్నారు. ఈ సమావేశంలో మంగపేట సెకండ్ ఎస్సై సురేష్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్, మంగపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, మండలంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.