—రోడ్డెక్కిన వేములపల్లి రైతన్నలు
—నార్కెట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై భారీ ధర్నా
–యాప్ అవగాహన లేక
ఇబ్బందులు
–పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్
వేములపల్లి, అక్షరకలం
యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానాన్ని నిరసన రైతులు ధర్నా చేపట్టారు నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రైతులు శనివారం భారీ ధర్నా చేపట్టారు.నార్కెట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు రోడ్ పై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.యూరియా
యాప్ విధానంతో రైతులు అవస్థలు పడుతున్నారు
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాప్ రిజిస్ట్రేషన్ విధానం వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అవగాహన లోపం చదువుకొని రైతులు, స్మార్ట్ ఫోన్లు లేని వారు యాప్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.
స్టాక్ యాప్‌లోనే మాయం అవుతుందని రైతులు లబోదిబో అంటున్నారు. యూరియా స్టాక్ వచ్చినట్లే వచ్చి నిమిషాల్లోనే మాయమవుతోందని, దీనివల్ల అసలైన రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని ఆరోపించారు.పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు మండిపడుతున్నారు. అవసరమైన సమయంలో యూరియా వేయకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యం చేసుకొని రైతుల ధర్నా చేస్తున్నారని సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా యాప్ ను విధానాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న పాత పద్ధతిలోనే నేరుగా రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేశారు.