నర్సాపూర్, అక్టోబర్ 01( అక్షర కలం వెబ్ ):-
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ పురస్కరించుకొని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా పండగ ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ, దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని, తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రజలు విజయదశమిని దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, దుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు…